ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారు.ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం.ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తాం. ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదే..పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించాం.రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం .జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం… మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.
ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
02 May 2026
47 వీక్షణలు
admin@newstelugu.com
ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం… మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.
Tags:
Telangana
telangana news
TGO
Telangana employees news
TGE JAC
JAC
TNGO
PRC
Health card
News in Telugu